![]() |
![]() |

ఇదేందయ్యా ఇది.. ఇది సీరియలా లేక సినిమానా ఓవైపు ఉన్న విలన్ తోనే హీరో చచ్చేలా ఉన్నాడురా అంటే మరో విలనా.. ఇక అంతే సంగతులు. ఇలా ప్రతీ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగుతుంది గుప్పెడంత మనసు.
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ లో తాజా ఎపిసోడ్ లలో రిషికి జరిగిన గాయాల నుండి తేరుకోవాలని వసుధార ప్రయత్నిస్తుంటుంది. ఆ కరుడుగట్టిన శైలేంద్ర కంటపడకుండా దూరంగా ఉంచి కంటికిరెప్పలా కాపాడుకుంటుంది. అంతలోనే ఎంట్రీ ఇస్తాడు వసుధార బావ రాజీవ్. చీకటి గదిలో వసుధార ఫొటోని చూస్తూ.. ‘ఆటలాడుకోవడం నీకే కాదు మరదలు పిల్లా.. నాకూ వచ్చు.. ఏంటి వసుధార ఇదీ.. ఈ బావని దెబ్బకొట్టి వాడ్ని పెళ్లి చేసుకుంటే ఎలా చెప్పు?? ఏమి అందం.. ఏమీ అందం.. అని వసుధార ఫొటోపై చేయి వేసి తన సైకోయిజాన్ని చూపిస్తుంటాడు రాజీవ్. నిన్ను వదల్లేకపోతున్నాను వసూ.. ఇప్పటికే నిన్ను పెళ్లి చేసుకుని కాపురం చేయాల్సిన నేను ఏడాదిగా కనిపించకుండా పోయాను. ఈ కొత్త సంవత్సరంలోనైనా నిన్ను నా దాన్ని చేసుకోవాలని వచ్చాను.. కానీ నువ్వు ఆ రిషి గాడ్ని పెళ్లి చేసుకున్నావని తెలిసింది. వెరీ బ్యాడ్.. వెరీ బ్యాడ్.. ఏంటి మరదల పిల్లా ఇదీ.. నువ్వు ఇలా చేసేముంది నీపైనే ఆశలు పెట్టుకున్న ఈ బావ గురించి ఆలోచించవా? అయినా నాలో లేనిది ఏంటి? వాడిలో ఉన్నది ఏంటి? నేను రా.. రా అంటే నాతో రావాలి కానీ వాడితో పోయావేంటి? ఇదే బాలేదు మరదలా.. అసలు ఈ బావని ఒంటరిని చేసి నువ్వు వాడితో వెళ్లిపోవడం న్యాయం కాదు. నువ్వే నా దిల్. నిన్ను పెళ్లి చేసుకోవడమే నా కర్తవ్యం.నువ్వు ఎవడితోనే ఉంటే వదిలేస్తానా?? అందుకే మళ్లీ వచ్చాను.. కథలోకి ఎంట్రీ ఇచ్చాను.
గుప్పెడంత మనసు సీరియల్ లో కొంతకాలం క్రితం వరకు శైలేంద్ర లేడు. అంతకముందు మెయిన్ విలన్ గా వసుధార వాళ్ళ బావ ఉండేవాడు. వాడి టార్చర్ భరించలేకపోయేది వసుధార. అప్పట్లో రాజీవ్ వచ్చాడంటే ఆ రావణాసురుడే వచ్చాడే అని ఈ సీరియల్ అభిమానులు అనుకునేవారు. అంతలా టార్చర్ చేసిన రాజీవ్ పాత్ర మళ్ళీ వస్తుందంటే ఈ సీరియల్ కి మరింత క్రేజ్ పెరుగుతుందనడంలో ఆశ్చర్యం లేదు. ఇక ఇప్పటికే శైలేంద్ర ధాటికి రిషిని కాపడుకోవడంలో మహేంద్ర, వసుధార, అనుపమ అల్లాడిపోతున్నారు. ఇక ఇప్పుడు రాజీవ్ కూడా ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తుంది. మరి మరదలు వసుధార మీద రాజీవ్ కి ఉన్న ఆశని నెరవేర్చుకుంటాడా లేక రిషిని ఎదుర్కోలేక వెనుదిరిగి వెళ్తాడా అనేది రాబోయే ఎపిసోడ్ లలో తెలియనుంది. రాజీవ్ రాకతోఈ సీరియల్ మరింత ఆసక్తిగా మారింది.
![]() |
![]() |